మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం స్పెయిన్ లో ల్యాండ్ అయ్యారట.. సాంగ్స్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం స్పెయిన్ వెళ్లినట్లు మేకర్స్ తెలిపారు. అందమైన లొకేషన్ల మధ్య రామారావు.. ముద్దుగుమ్మలతో చిందులు వేయనున్నాడు. ఇకపోతే ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయినట్టే అని సమాచారం. మరి ఈ సినిమాతో రవితేజ హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.