Today Stock Market Roundup 03-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు.
Today Stock Market Roudup 20-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గురువారం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత లాభాల్లోకి వచ్చి ఇంట్రాడేలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి.
Today Stock Market Roundup 20-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్ జోన్‌లోనే ట్రేడింగ్ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్ స్టాక్స్‌తోపాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.
Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించింది. ట్రేడింగ్‌కి సంబంధించి.. వీకెండ్ రోజైన ఇవాళ శుక్రవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు రావటంతో శుభారంభం లభించింది. కానీ.. ఇంట్రాడేలో ఊగిసలాటకు గురయ్యాయి. చివరికి పాజిటివ్ జోన్‌లోకి టర్న్ అయ్యాయి. దీంతో నిఫ్టీ మిడ్‌క్యాప్100, స్మాల్‌క్యాప్100.. సున్నా పాయింట్ 6 శాతం పెరిగాయి.
Today Stock Market Roundup: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాల్టీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Today Stock Market Roundup 10-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు.. అంటే.. ఇవాళ శుక్రవారం కూడా నష్టాలు కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో కీలక సూచీలు రోజంతా కోలుకోలేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా.. సెన్సెక్స్, నిఫ్టీ.. రెండూ కూడా బెంచ్‌మార్క్ విలువలకు దిగువనే నమోదయ్యాయి.
Today (15-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది. దీంతో.. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగిసింది. రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్క్‌లకు పైనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 18 వేల పాయింట్లను మించటం విశేషం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది.
Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్‌గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.
Today (05-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్‌లతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది.
Today (04-01-23) Stock Market Roundup: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ తొలిసారి నష్టాలతో ముగిసింది. ఈ రోజు బుధవారం ఉదయం రెండు సూచీలు కూడా అతి స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ లాసులతో క్లోజ్ అయ్యాయి. ఇంట్రాడేలో టుడే లోయెస్ట్ వ్యాల్యూస్‌కి పడిపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గింది. ఫలితంగా సెన్సెక్స్ 60 వేల 633 పాయింట్లకు, నిఫ్టీ 18 వేల…