Today Stock Market Roudup 20-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గురువారం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత లాభాల్లోకి వచ్చి ఇంట్రాడేలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులతోపాటు లోకల్ కంపెనీల క్యూ4 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేశాయి.
సెన్సెక్స్ నామమాత్రంగా 64 పాయింట్లు పెరిగి 59 వేల 632 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. సింగిల్ డిజిట్.. అంటే.. 5 పాయింట్లు మాత్రమే పెరిగి 17 వేల 624 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Sid’s Dairy Farm: స్వచ్ఛమైన పాలకు అచ్చమైన సంస్థ అంటున్న కిషోర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎన్‌టీపీసీ, ఏసియన్ పెయింట్స్ విశేషంగా రాణించాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. ఎన్‌టీపీసీ, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ వంటి లార్జ్ క్యాప్స్.. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు మద్దతుగా నిలిచాయి.
మరో వైపు.. ఇన్ఫోసిస్, రిలయెన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ స్టాక్స్ ఒత్తిడి పెంచాయి. ఇదిలాఉండగా.. ఐటీసీ సంస్థ తొలిసారిగా ఎలైట్ గ్రూప్ కంపెనీల జాబితాలోకి చేరింది. మార్కెట్ క్యాప్ వ్యాల్యూ 5 ట్రిలియన్ రూపాయలు దాటిన సంస్థలను ఎలైట్ గ్రూప్ కంపెనీలుగా వ్యవహరిస్తారు.
ఈ కంపెనీ షేర్ విలువ ఇవాళ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 402 రూపాయల 60 పైసలుగా నమోదైంది. రంగాల వారీగా పరిశీలిస్తే.. ప్రైవేట్ బ్యాంక్, ఆటో స్టాక్స్ మంచి పనితీరు కనబరచగా.. ఫార్మా, రియాల్టీ స్టాక్స్ వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం ధర 72 రూపాయలు పెరిగి గరిష్టంగా 60 వేల 370 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 157 రూపాయలు పెరిగి అత్యధికంగా 75 వేల 629 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 160 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 406 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 16 పైసల వద్ద స్థిరపడింది.