Today (04-01-23) Stock Market Roundup: ‘అమెరికా’ ప్రభావం.. అమాంతం నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (04-01-23) Stock Market Roundup: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ తొలిసారి నష్టాలతో ముగిసింది. ఈ రోజు బుధవారం ఉదయం రెండు సూచీలు కూడా అతి స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ లాసులతో క్లోజ్ అయ్యాయి. ఇంట్రాడేలో టుడే లోయెస్ట్ వ్యాల్యూస్‌కి పడిపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గింది. ఫలితంగా సెన్సెక్స్ 60 వేల 633 పాయింట్లకు, నిఫ్టీ 18 వేల 037 పాయింట్లకు దిగొచ్చాయి.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ లేటెస్ట్ పాలసీ మీటింగ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ భేటీ నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు వెయిటింగ్ చేయటంతో డీల్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ఇండెక్స్‌లకు ప్రాఫిట్స్ కరువయ్యాయి. సెన్సెక్స్ 636 పాయింట్లు కోల్పోయి మరోసారి 61 వేల పాయింట్ల మార్క్ కన్నా దిగువకు పడిపోయింది. చివరికి 60 వేల 657 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 189 పాయింట్లు నష్టపోయి 18 వేల 42 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
read more: Upcoming Electric Cars in 2023: ఈ సంవత్సరం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో రెండు కంపెనీలు మాత్రమే స్వల్ప లాభాలను ఆర్జించాయి. ప్రిజమ్ జాన్సన్, ఆర్‌సీఎఫ్ స్టాక్స్ ఇవాళ్టి కనిష్ట విలువ నుంచి 9 శాతం వరకు పెరిగాయి. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, గ్లెన్‌మార్క్, రెయిన్ ఇండ్స్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ ఒక శాతం వరకు డౌన్ అయ్యాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మరియు రియాల్టీ ఇండెక్స్ ఒక శాతం కన్నా ఎక్కువ చొప్పున లాసయ్యాయి.
నిఫ్టీ50లో దివిస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ లీడర్స్‌గా నిలిచాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, కోల్ ఇండియా బాగా వెనకబడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ విలువ ఏకంగా 18 శాతం పెరగటం విశేషం. తద్వారా 52 వారాల గరిష్ట విలువను నమోదు చేసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 5 శాతం నేల చూపులు చూశాయి. క్యూ3 అప్‌డేట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి నెలకొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
10 గ్రాముల బంగారం రేటు 288 రూపాయలు పెరిగి గరిష్టంగా 55 వేల 818 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 242 రూపాయలు లాభపడి అత్యధికంగా 70 వేల 159 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 26 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 80 పైసలుగా నమోదైంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!