నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి జెన్‌కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు.…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30కి హైకోర్టు సీజే కొత్త జడ్డీలతో ప్రమాణ…
నేడు రెండో రోజు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరుగనుంది. నిన్న వేలంలోకి అన్ని విభాగాల్లోని 96 మంది క్రికెటర్లు వచ్చారు. అయితే 96 మందికి 74 మందిని ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. మరో 22 మంది కొనుగోలుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఫ్రాంచైజీల వద్ద మొత్తం 107 మంది ఆటగాళ్లు ఉన్నారు. నేడు ఏపీలోని విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి…
నేడు విజయవాడకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావు రానున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై మేధావులతో భగవత్ కిషన్ రావు సమావేశం కానున్నారు. నేడు విజయవాడకు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఈ సందర్బంగా ఆమె కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మాట్లాడనున్నారు. అలాగే గోవా ఉత్తర…
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో బాలకృష్ణ మౌన దీక్షకు దిగనున్నారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నేడు అమరావతిలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ చర్చించనుంది. నేడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అయితే గోరఖ్ పూర్…
నేడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ అధికారులు కానున్నారు. జనవరి 2న కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది. తన హక్కులకు భంగం కలిగించారని లోక్ సభ స్పీకర్ కు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు తెలంగాణ హై కోర్టులో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరుగనుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా కట్టడికి…
నేడు ఏపీలో సినిమా టికెట్ పరిశీలన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లో సమావేశం జరుగనుంది. అయితే గత నెలలో కూడా సినిమా టికెట్ల విషయమై కమిటీ సమావేశమైంది. సభ్యుల సూచనలు మేరకు ఈ రోజు మరోసారి కమిటీ చర్చించనుంది. శంషాబాద్ ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 9 గంటలకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు వాస్తుశాంతి, రుత్విక…
ఉద్యోగ సంఘాలకు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ లేఖ రాసింది. నిన్నటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణాలో నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి.…
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 5 రోజులపాటు చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న ప్రధాని మోడీ సమాధానం, కరోనా దృష్యా వేర్వేరు సమయాల్లో ఉభయ సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి…
నేడు వర్చువల్ గా జీఆర్ ఎంబీ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కమిటీ చర్చించనుంది. నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి పరామర్శించనున్నారు. నేడు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. మహారాష్ట్రలో నేటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.…