నేడు ఏపీలో సినిమా టికెట్ పరిశీలన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లో సమావేశం జరుగనుంది. అయితే గత నెలలో కూడా సినిమా టికెట్ల విషయమై కమిటీ సమావేశమైంది. సభ్యుల సూచనలు మేరకు ఈ రోజు మరోసారి కమిటీ చర్చించనుంది.
శంషాబాద్ ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 9 గంటలకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కోవిడ్ నియంత్రణ చర్యలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కుపై సీఎం జగన్ సమీక్ష నిర్వ్యాహించనున్నారు. ఏపీలో కరోనా కేసులు రోజు 10 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీలో మూడో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవ్యస్థ,బడ్జెట్ పై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
నేడు ఆంటిగ్వాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.