నేడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ అధికారులు కానున్నారు. జనవరి 2న కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది. తన హక్కులకు భంగం కలిగించారని లోక్ సభ స్పీకర్ కు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నేడు తెలంగాణ హై కోర్టులో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరుగనుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని హై కోర్టు విచారించనుంది.
నేడు ముచ్చింతల్ లో రెండో రోజు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. నేడు వేడుకల్లో జమ్మి, రవి చెట్లతో అగ్నిమథనం చేయనున్నారు.
నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు.
హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48.980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,600లుగా ఉంది.