దేశంలో 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు తెలియనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగనుంది. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,300 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,800లుగా ఉంది. అలాగే కిలో వెండి రూ.76,700లుగా ఉంది. నేడు వైసీపీ…
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు. శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్…
నేడు అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పాలసముద్రం వద్ద నిర్మించనున్న జాతీయకస్టమ్స్ పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీకి భూమి పూజ నిర్వహించనున్నారు. నేడు మణిపూర్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్‌రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు…
నేడు పోలవరంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, ఏపీ సీఎం జగన్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు. నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ జరుగనుంది. మొహాలీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌లో నేటి నుంచి మహిళల ప్రపంచకప్ జరుగనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌తో సీఎం కేసీఆర్…
నేడు ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీల అమలు జరుగనుంది. తెలంగాణ ఈ చలాన్ వెబ్‌సైట్‌లో చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించనున్నారు. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ ఆలయాలు దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని…
నేడు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. సమావేశానికి హజరుకావాలని 240 మంది సభ్యులకు ఆహ్వానం పంపించారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత తొలిసారి సమావేశం కానున్నారు. నేడు సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్ కలువనున్నారు.…
శ్రీశైలంలో నేడు మూడో రోజు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. నేడు ఏపీ డీజీపీగా కె.వెంకటరాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎపీపీఎస్సీకి చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేడు ఇండోర్‌లో గోబర్ దాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. నేడు గుజరాత్‌లో…
నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు. నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3…
నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి అమోదించనుంది. రూ. 3,171 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. నేడు ఢిల్లీలో హోంశాఖ సబ్ కమిటీ భేటీ కానుంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకి హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో…
ఇవాళ్టి నుంచి మేడారంలో మహాజాతర. నాలుగురోజుల పాటు జరగనున్న జాతరకు కోటిన్నరమంది భక్తులు వస్తారని అంచనా. హెలికాప్టర్ లోనూ మేడారం వెళ్ళే అవకాశం. ఇవాళ తిరుమలలో మాఘమాస పౌర్ణమి సేవ నిర్వహిస్తున్న టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాఢ వీధులలో విహరించనున్న మలయప్పస్వామి. తిరుమలలో ఉదయాస్తమాన సేవా యాప్ ని ప్రారంభించనున్న టీటీడీ. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించనున్న టీటీడీ. తిరుమల అంజనాద్రిలో…