నేడు విజయవాడకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావు రానున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై మేధావులతో భగవత్ కిషన్ రావు సమావేశం కానున్నారు.
నేడు విజయవాడకు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఈ సందర్బంగా ఆమె కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మాట్లాడనున్నారు. అలాగే గోవా ఉత్తర జిల్లాల నియోజకవర్గాల ఓటర్లను ఉద్దేశించి సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
నేడు పంజాబ్ సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్దూతో భేటీ తర్వాత సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. పంజాబ్ అసెంబ్లీకి ఈ నెల 20న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
నేడు యూపీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేయనున్నారు.