మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది.
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఓడిపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నాయి. బెంగాల్లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన…
Kolkata : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు స్వపన్ దేబ్నాథ్ 'రీక్లైమ్ ది నైట్' ఉద్యమంలో తమ కుమార్తెలు ఏమి చేస్తున్నారో కుటుంబాలు చూడాలని చెప్పి కొత్త వివాదానికి తెర లేపారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత.
Rape Attempt: అత్యాచారం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. నిందితుడు నారాయణ్ తన నివాసంలో బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన బంకురా నివాసంలో మూడు రోజుల పాటు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా టీఎంసీ ఆయనను ట్రేడ్ యూనియన్ నుంచి సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై అత్యాచారం,…
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ హర్భజన్ సింగ్ ప్రకటన వెలువడింది.