Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..
- ఒకప్పటి తెలుగు హీరోయిన్- టీఎంసీ ఎంపీ రచనా బెనర్జీపై తెగ ట్రోలింగ్..
- ‘‘క్వింటాల్ వాటర్’’ అంటూ కామెంట్స్..
- నీటిని క్వింటాళ్లలో కొలవడమేంటని నెటిజన్ల ఎగతాళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతున్నాయి. బెంగాల్‌లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన పడ్డారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Minister Payyavula: ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల సమీక్ష
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
నిజానికి నీటిని లీటర్లలో, పెద్ద మొత్తం నీటిని క్యూసెక్కులతో కొలుస్తారు. టీఎంసీ ఎంపీ క్వింటాల్‌ని నీటికి కొలమానంగా ఉపయోగించింది. క్వింటాల్ అనేది ఆహారధాన్యాల కొలమానంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రచన, ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హుగ్లీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీని ఓడించి ఎంపీగా గెలిచారు.
అయితే, ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఓ యూజర్ తన పోస్టులో ‘‘ నీటిని క్వింటాళ్లలో కొలవవచ్చని ఈ రోజు నేర్చుకున్నా.. నేర్చుకోవడానికి అంతం లేదు’’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. మరికొందరు ఆమెను అక్కడి ఓటర్లు ఎలా ఎన్నుకున్నారు..? అని ప్రశ్నించారు. అయితే, మరికొంత మంది యూజర్లు మాత్రం ఆమెకు మద్దతు నిలిచారు. టంగ్ స్లిప్ అయి ఈ వ్యాఖ్యలు చేసి ఉండచ్చని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిర్వహించే డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడం, భారీ వర్షాల కారణంగా దక్షిణ బెంగాల్‌లోని అనేక జిల్లాలు వరదలకు గురయ్యాయి. ఈ వరదల వల్ల బెంగాల్‌లో 28 మంది మరణించారని సీఎం మమతా బెనర్జీ చెప్పారు.
This is TMC MP Rachana Banerjee of Hooghly LS.
She said that, the DVC has released "quintal quintals" of water without informing the WB state government. 😲
2 – 4 kg water release would have been fine but strongly opposed such 'quintal-quintal' water release of DVC.😝
It is a… pic.twitter.com/sSli6cJrgg— Krishanu Singha (@KrishanuOnline) September 25, 2024
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!