Man Died After Eating Egg Fried Rice in Tirupati : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువ అయిపోయింది. పాలు దగ్గర నుంచి టీ పొడి, కారాల వరకు ఏదీ స్వచ్ఛంగా ఉండటం లేదు. పాలలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న కేటుగాళ్లు, టీ పొడి లాంటి వాటిలో కూడా రంపం పొడి కలిపి విక్రయిస్తున్నారు. ఇక నూనెల కల్తీ గురించి అయితే చెప్పా్ల్సిన పని లేదు. జంతువుల ఎముకల పొడి నూనెలో కలిపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో అయితే లాభం కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇలాంటి వారిని పట్టుకున్నా ఏదో ఒక రకంగా కల్తీలకు పాల్పడుతూనే ఉన్నారు.
Also Read: MP Ramesh Bidhuri: తోటి సభ్యుడిని ఉగ్రవాదిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ.. ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు
ఇక ఫుడ్ పాయిజన్ కారణంగా 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ లోని కాలురూలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయం ఏంటంటే తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. అనంతరం అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా రుయా ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే నరేంద్ర మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన దుకాణం పై నరేంద్ర కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నరేంద్ర తిన్న దుకాణంకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నరేంద్ర చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.