Srinivasa Setu Flyover: తీరిన ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Setu Flyover: కళియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూనే ఉంటారు.. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు భక్తులు.. ఇక, విదేశాల నుంచి సైతం వెంకన్న దర్శనానికి తరలివస్తుంటారు.. దీంతో.. తిరుపతిలో ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ పరిస్థితికి ఓ ఫ్లైఓవర్‌తో చెక్ పెట్టారు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతికి మణిహారంగా భావిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ఈ రోజు ప్రారంభించారు సీఎం.. తన తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం జగన్.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి మణిహారంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిలుస్తుందని తెలిపారు.
Read Also: Klin Kaara Konidela: మూడు నెలల తర్వాత తండ్రి ఇంటికి క్లిన్ కార… వేద మంత్రాలతో ఆహ్వానం!
Also Read
ఇక, శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టును తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా చేపట్టిందని వెల్లడించారు సీఎం జగన్.. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో.. యాత్రికులతో పాటు.. స్థానిక ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.684 కోట్లు వెచ్చించి.. దాదాపు 7.34 కిలోమీటర్లు విస్తీర్ణంలో నిర్మించారు.. 2019 మార్చిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలోనే పనులు పూర్తి అవుతాయని భావించినా.. నిర్మాణం చివరి దశకు చేరుకున్న తర్వాత చోటు చేసుకున్న ప్రమాదంతో పనులు పూర్తి చేయడానికి మరింత సమయం పట్టింది.. మొత్తంగా.. ఈ రోజు శ్రీనివాససేతు ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, తిరుపతి పర్యటనలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ భవనాలను కూడా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!