తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 363 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, 1లక్ష 90 వేల రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్, ఐరన్ కట్టర్, గ్రైండర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: VarunLav: వరుణ్- లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే.. ?
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ నేపధ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించిన, నిల్వ ఉంచిన కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. లైసెన్స్ కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి అని ఆయన సూచించారు.
Read Also: Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 22 యాప్స్, వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
ఇక, బాణా సంచా లాంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదు అని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవాలి.. షాపుల దగ్గర, నీరు, ఇసుక తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పని సరిగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.