Tirupati: రెండు వేరు వేరు స్వభావాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకటై జీవితాంతం కలిసి ఉండేలా మన శాస్త్రాలు పెళ్లి ప్రతిపాదనను ఏర్పాటు చేశాయి. గొడవ పడని బంధం కన్నా ఎన్ని గొడవులున్న విడిపోకుండా కలిసి ఉండే బంధమే గొప్పింది. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. అయితే ఆ కలతలు బాపుకుని.. ఒకరి తప్పులను మరొకరు క్షమిస్తూ ఇద్దరు సర్దుకుపోతే అసలు సమస్యే ఉండదు. అలా కాని పక్షాన జీవితాలు నాశనం అవుతాయి. దాంపత్య జీవితంలో గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు గతంలో కోకొల్లలు.
Read also:Andela Sriramulu: పథకాల పేరుతో మోసం చేశారు.. ఎన్నికల ప్రచారంలో అందెల శ్రీరాములు
అలాంటి ఘటనే తాజాగా తిరుపతిలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. తిరుపతి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది . విజయవాడ కు చెందిన మణికంఠ అనే వ్యక్తికి దుర్గ అనే మహిళతో వివాహం జరిగింది. కాగా గత కొంత కాలంగా మణికంఠకు తన భార్య దుర్గకు మధ్య విబేధాలు వచ్చి తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గ పుట్టింటికి వెళ్ళింది. కాపురానికి రమ్మని మణికంఠ ఎన్ని సార్లు పిలిచిన అతని భార్య కాపురానికి రాలేదు. దీనితో మనస్తాపానికి గురైన మణికంఠ పోలీస్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్పందించిన పోలీసులు హుటాహుటీన మణికంఠను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.