రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తిరుపతిలోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోక్సోకేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రేపటి నుంచి (నవంబరు 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు) నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు.
తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి.
తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..
తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ ..
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు…
టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు..
తిరుపతి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్ లో ఇరుక్కున్నారు దంపతులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సాయిబాబు దంపతులు.. మొదటి గేట్ వద్ద లిఫ్ట్ లో నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్ ఆగిపోయింది.. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.. అయితే, టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేపట్టడంతో కిందకు దిగింది లిఫ్ట్.
తిరుపతి జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు.