Tiruchanoor: నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు (నవంబరు 28 ) నుంచి డిసెంబరు 6వ తేది వరకు జరగనున్నాయి. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో అమ్మవారి ఆలయం ఉదయం నుంచి కిటకిట లాడింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
Read also: AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన!
తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు ఇలా..
* ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణ.
* బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు.
* పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు ఏర్పాటు.
* పంచమి రోజున 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భక్తులకు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందించనున్నారు.
*బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్‌తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేయనున్నారు.
* బ్రహ్మోత్సవాలలో టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది.. పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.
* బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించనున్నారు.
* డిసెంబరు 6న అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా అని టీటీడీ ఈవో శ్యామల రావు వివరించారు.
Maharashtra CM Post: మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ..