Tirupati: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో అర్ధరాత్రుల్లో మహిళ వింత అరుపులు కొందరి యువకులను భయాందోళనకు గురిచేశాయి. ఎల్.వి.పురం గ్రామం కట్లకణం దగ్గర బైక్‌పై వెళుతున్న యువకులకు చీకట్లో మహిళ కంటపడడంతో యువకులు భయంతో పరుగులు పెట్టారు. చీకటిలో మహిళ వింతగా అరవడంతో యువకులు భయపడ్డారు. ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌తో ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో తరచూ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. దుష్ట శక్తా, లేక మతిస్థిమితం లేని మహిళా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తిస్తోంది.
Read Also: Tragedy: విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి