Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి వేకువజామున మూడు గంటల వరకు.. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై కేక్‌లు కట్ చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళుతుంటారు వాహనదారులు. ఇక లారీలు, పెద్ద వాహనాలైతే చెప్పాల్సిన పనిలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీలకు పనిచెబుతుంటారు. జరిమానాలతో బుద్ధి చెబుతారు. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వ్యక్తి ఏం తప్పుచేశాడో, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు కొడుతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. సామాన్యుడిపై అలా…