Mohan Babu University Kidnap Case: ఆధారాలు దోరికాయి.. మంచు మోహన్ బాబు, విష్ణు లకు నోటీసులు ఇస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu University Kidnap Case: తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
Also Read
ఈ ఘటనపై తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో ఫీజుల వసూళ్లపై నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్‌లను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు అందగానే పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. శేషాపురం ప్రాంతంలో కిడ్నాప్‌కు పాల్పడిన 13 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఇనోవా వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ మూడు వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవేనని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో పాటు బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపారు. బౌన్సర్లను కేవలం స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
Egg Veg or Non-Veg: మిలియన్ డాలర్స్ క్వశ్చన్.. “కోడిగుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్”?
ఈ కేసులో A2, A3గా మోహన్ బాబు, విష్ణుల పేర్లు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తామని రవిమనోహరచారి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని, తప్పు చేసినవారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు