కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తిరుపతిలో భారీ బ్లాక్ అండ్ వైట్ మనీ స్కాం వెలుగులోకి వచ్చింది. వైట్ మనీ ఇస్తే రెండింతలు బ్లాక్ మనీ ఇస్తామని హైదరాబాద్ వ్యక్తికి టోకరా వేశారు మోసగాళ్లు. ఇద్దరు మహిళలు ద్వారా హైదరాబాద్ కు చెందిన శంకర్ రెడ్డికి ఎరవేశాడు రాయచోటి కి చెందిన కేటుగాడు మురుగేశన్. కుప్పంలోని ఓ బారులో పరిచయమైన 7మంది యువకులతో కలిసి పక్కా స్కెచ్ వేసిన మురుగేశన్. రూ. 35లక్షల వైట్ మనీతో తిరుపతి చేరుకున్నాడు శంకర్ రెడ్డి. శంకర్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి కారులో యువకులతో కలిసి చేరుకున్నాడు మురుగేశన్.
Read Also: Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్
శంకర్ రెడ్డి కళ్లలో కారం పొడి చల్లి రూ.35 లక్షల బ్యాగుతో పరార్ అయ్యారు. డైల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు శంకర్ రెడ్డి. బైపాస్ రోడ్డు లోని రక్షక్ పోలీసులను అలెర్ట్ చేశారు ఎంఆర్ పల్లి పోలీసులు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. చంద్రగిరి (మం)గాదెంకి టోల్ ప్లాజా వద్ద కారును పట్టుకున్నారు పోలీసులు. కారులోని బ్యాగుతో పాటు 7 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యువకులను స్టేషన్ కు తరలించి తాళం వేసిన బ్యాగును పరిశీలించారు పోలీసులు.
ఆ బ్యాగులో నగదు లేకపోవడంతో ఖంగుతిన్నారు పోలీసులు. మార్గ మధ్యంలో రూ.35 లక్షల నగదుతో ఉడాయించాడు కేటుగాడు మురుగేశన్. పరారైన మురుగేశన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బ్లాక్ అండ్ వైట్ మనీ స్కాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా జనంలో మాత్రం మార్పు రావడంలేదు. ఏం ఆలోచించకుండా లాటరీల పేరుతో వచ్చే కాల్స్ కు కూడా స్పందించి డబ్బులు పంపి అడ్డంగా బుక్కవుతున్నారు.
Read Also: Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు