ఈమధ్యకాలంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలో రూ.35 లక్షల దోపిడీ కేసు సంచలనం కలిగించింది. తిరుపతి హైవే పై రూ.35 లక్షల దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 35 లక్షల రూపాయలు నేరుగా చేతికి ఇస్తే, 70 లక్షల రూపాయలు ఆన్లైన్లో అకౌంట్ కు బదిలీ చేస్తామంటూ కొనసాగింది మోసం. రెట్టింపు సొమ్ముకు ఆశపడి 35 లక్షల రూపాయలు తెచ్చిన వారి నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయింది ముఠా. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఆ సమయంలోనే అప్పటికే చేతులు మారిపోయింది నగదు.
Read Also: Chiranjeevi: చిరును కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఆలీ
ఈనెల 3వ తేదీన తిరుపతి – చిత్తూరు హైవే పై ఘటన జరిగింది. కీలక నిందితుడితో పాటు 35 లక్షల నగదు కోసం గత వారం రోజులుగా ముమ్మరంగా గాలించారు పోలీసులు. ముఖ్య సూత్రధారి కృష్ణమూర్తి అలియాస్ కిరణ్ ను ఇవాళ అరెస్టు చేసి, 35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితులందరిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన శంకర్ బ్యాచ్ పై కళ్ళ ల్లో కారం కొట్టి రూ. 35 లక్షల రూపాయల బ్యాగ్ తో ఉడాయించింది కృష్ణమూర్తి అలియాస్ కిరణ్ బ్యాచ్.
నేరం జరిగిన గంట వ్యవధిలోనే హైవే పై ఒక టోల్ ప్లాజా వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులంతా కుప్పం ప్రాంతానికి చెందిన అధికార వైసీపీ కార్యకర్తలు అంటున్నారు పోలీసుఉ. కుప్పం కు చెందిన ముఖ్య వైసీపీ నేతలతో నిందితులకు పరిచయాలు వున్నాయి. మహిళలతో ఫోన్ లో మాట్లాడించి ముగ్గులో దించి దోపిడీకి పాల్పడింది ముఠా. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.
Read Also: Chiranjeevi: చిరును కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఆలీ