తిరుమల శ్రీవారిని నిన్న 5788 మంది భక్తులు దర్శించుకున్నారు. 2258 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 24 లక్షలుగా ఉంది. అయితే ఇవాళ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునరుద్ధరణ జరుగుతుంది. అలాగే జూన్ నెలకుకు సంభందించి ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేసింది టీటీడీ. కానీ కోవిడ్ కారణంగా దర్శనాలు సంఖ్యని 5 వేలకు తగ్గించింది టీటీడీ. అయితే ఏపీలో కరోనా కేసులు…
నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
కరకం బాడి మార్గంలోని టీటీడీకి చెందిన శేషాచల నగర్ లోని 75వ నెంబర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది టిటిడి. పంచనామా సందర్బంగా ఇంట్లోని పెట్టెలో 6 లక్షల 15 వేల 50 రూపాయల తో పాటు దాదాపు 25 కిలోల చిల్లర నాణాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఈ మొత్తం స్వాధీనం చేసుకున్న దానిని టీటీడీ ఖజానాకు జమ చేశారు అధికారులు. అయితే 2008లో టీటీడీ ఆ ఇంటిని తిరుమలకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తికి…
తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ…
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.
కరోనా కారణంగా 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి చెందారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తునందు వలన వైరస్ సోకడం లేదని.. టిటిడి ఉద్యోగులు అందరికి యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుండటం కారణంగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులుకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తామని..గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాది…