తిరుమల : ఎన్నికలు అయిన రెండు సంవత్సరాలు తరువాత తనపై కోర్టులో కేసు వేసారని… ఎంపి నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు. తన పై కేసు వేసింది… తనపై ఓడిపోయిన శివసేనా అభ్యర్దేనని ఆమె పేర్కొన్నారు. ఐదు సార్లు ఎంపిగా ఎన్నికై… కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి నా పై రాజకీయ కుట్రలు చేస్తూన్నారని ఆమె మండిపడ్డారు. నేను ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయాలోకి వచ్చానని… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఆమె తెలిపారు.
read also : పలాసలో పొలిటికల్ హీట్.. ఒకే చోట ఫోకస్ పెట్టిన ఆ నేతలు!
నాకు గుర్తింపు లభించింది తెలుగు ప్రజల వల్లనేనని.. వారి కోసం పార్లమెంటులో మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రాలో రైతులు, యువత ఇబ్బందులు పడుతున్నారని..వారికి సహకారం అందిస్తానని తెలిపారు ఎంపి నవనీత్ కౌర్. కాగా.. తప్పుడు కుల ధృవీకరణ పత్రాల కేసులో నవనీత్ కౌర్ కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించిన సంగతి తెలిసిందే.