తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు…
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని…
ఎస్వీ వేదిక్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ సుదర్శన శర్మ పై వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా ఇప్పటికే మూడు పర్యాయాలు వైస్ ఛాన్సలర్ గా కొనసాగారు సుదర్శన శర్మ. ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. గత ఏడాది నవంబర్ లోనే వీసీ సుదర్శన శర్మ పదవీకాలం ముగిసింది. ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ నిబంధనలకు వ్యతిరేకంగా పదవిలో కొనసాగారు సుదర్శనశర్మ. నూతన వైస్ ఛాన్సలర్ నియామకం జరగకుండా సేర్చ్ కమిటీకి సుదర్శనశర్మ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు…
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్ధన్ రాయల్‌గా పోలీసులు వెల్లడించారు. కాగా ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి…
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. సామాన్య భక్తులకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని ముంబైలో కేటాయించింది.. దాని విలువ రూ. 500 కోట్లుగా ఉంటుందని.. త్వరలోనే భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం ప్రారంభించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా…
నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు…
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది…
* నేడు కరీంనగర్ కు రానున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకూ భారీ ర్యాలీ * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు. * ఈ…