టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్య గమనికను విడుదల చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. Jagan Davos Tour: స్టైలిష్…
హనుమాన్ జయంతి వేడుకల్ని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి అలయం ఎదుట ఉన్న బేడీ అంజనేయ స్వామి అలయం..ఆకాశగంగ తీర్ధంలో వున్న బాలహనుమాన్ దేవాలయాలలో టీటీడీ…జపాలిలో కొలువైన భక్తాంజనేయస్వామి ఆలయంలో దేవాదాయశాఖ…ధర్మగిరి వద్ద వున్న ఆభయ ఆంజీనేయస్వామి ఆలయంలో తిరుమల స్ధానికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీటీడీ తరపున ఆలయ అధికారులు బాలహనుమాన్ తో పాటు జపాలి హనుమంతుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామదూతగా… సేవాతత్పరుడిగా…అఖండబలశాలైన హనుమంతుడిని పూజించని వారుండరంటే అతిశయోక్తికాదు.అంజనీ తనయుడి జయంతి వేడుకల్ని తిరుమల కొండ…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మే 21న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. GVL Narasimha Rao: విజయవాడ- ఢిల్లీ విమానాలు పెంచాలి మరోవైపు వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూన్ 30 వరకు అష్టదళపాద…
తిరుమలలో స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలో హిందూ ధార్మిక ప్రచారానికి కొత్త ఒరవడి సృష్టించాలన్నారు స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలోని హరిజన,గిరిజన వాడలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని గట్టిగా నిర్వహించాలన్నారు. హరిజన, గిరిజన వాడలలో ఇతర మతస్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. స్వధర్మ వాహిని ద్వారా తెలుగు రాష్ర్టాలలో….అటు తరువాత దక్షిణాది రాష్ట్రాలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు స్వరూపానంద స్వామీజీ. టీటీడీకి విశాఖ పీఠానికి…
కలియుగ వైకుంఠం తిరుమలలో ఇకనుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు. భక్తులు సౌకర్యార్ధం యాత్రికులు వసతి సముదాయంలో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాం. ఏప్రిల్ 24వ తేది నుంచి వయోవృద్దులు,వికలాంగులుకు ప్రత్యేక దర్శనాలు ప్రారంభించాం అని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి…
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు…
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని…