తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.