Trivikram : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.గత ఎన్నికలలో తాను పోటీ చేసిన భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పవన్ ఓటమి చెందాడు.ఓటమి చెందినందుకు క్రుంగిపోకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు.గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజలలోనే మమేకం అయ్యారు.ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ బీజేపీ,టీడీపీ తో కలిసి కూటమిగా ఏర్పడ్డారు .కూటమిలో భాగంగా జనసేన తరపున 21 అసెంబ్లీ సీట్లు ,రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ మొత్తం అన్నింటిలో విజయం సాధించారు.అంతే కాదు తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ తో గెలుపొందారు.
Read Also :OG : ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?
పవన్ కల్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు ,అభిమానులు ,మెగా కుటుంబం ఎంతో అండగా నిలిచారు.దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కు మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ కు మంచి బాండింగ్ వుంది.పవన్ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడంలో త్రివిక్రమ్ పాత్ర ఎంతో వుంది.పవన్ గెలుపుకోసం త్రివిక్రమ్ తన పూర్తి మద్దతు అందించారు.తాజాగా పవన్ కల్యాణ్ అఖండ విజయం సాదించడంతో త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ ,వీడియో వైరల్ అయింది.ఇవాళ ఉదయం వీఐపి దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకోనున్నారు.
Director #Trivikram Srinivas with his wife #Soujanya and son #Rishi visits #Tirumala by walk. pic.twitter.com/KkIUNYzxNg
— Filmy Focus (@FilmyFocus) June 17, 2024