తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి గంటల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ ఆన్లైన్లో దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు టీడీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి దర్శించుకోవాలనే భక్తుల కోసం టీటీడీ నేడు టికెట్లను విడుదల చేయనుంది. ఇవాళ ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్లాట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలో శ్రీవారి…
గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపటి(ఈ నెల 18) నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.