Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..
- పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు.
- కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.
- వీరిని మహారాష్ట్రలో గోల్డెన్ బాయ్స్ గా గుర్తుపడతారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.
ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల బంగారు గొలుసులు ధరించి నిలబడి ఉన్నారు. పురుషుల మెడలో పెద్ద చైన్లు, బ్రాండెడ్ సన్ గ్లాసెస్ కూడా కనిపిస్తాయి. ఆ భక్తులు నానా సాహెబ్ వాగ్చొరె, సంజయ్ గుజర్లు. వీరిని మహారాష్ట్రలో సొంత పేర్లతో పిలిస్తే ఎవరూ గుర్తు పట్టారు. గోల్డెన్ బాయ్స్ అంటేనే వీళ్ళను గుర్తుపడతారు. వీరి ఒంటి నిండా కూడా బంగారు నగలే. మెడలో లావుపాటి బంగారు చైన్లను ధరించారు. వారు వీడియోలో మోచేతుల వరకూ బంగారు పట్టీలను ధరించారు.
Also Read
ఇకపోతే మరోవైపు వాళ్లతో పాటు వచ్చిన మహిళ బంగారుతో చేసిన చీరెను ధరించింది. వీరు ఇదివరకు కూడా హిందీ బిగ్ బాస్ హౌస్ లోనూ తళుకుమన్నారు. ఇకపోతే నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వారు మాట్లాడుతూ.. చాలాకాలంగా తాము శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకుంటోన్నామని, ఆ కోరిక నేటితో తీరిందని తెలిపారు.
25 కిలోల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పూణేకు చెందిన గోల్డ్ మెన్, బిగ్ బాస్ ఫేమ్ సన్నీ నానా సాహెబ్, సంజయ్ గుజర్ లు..#TTD #tirumala #Tirupati #goldmen #pune #sunnynanasaheb #sanjaygujar #BiggBoss #NTVTelugu pic.twitter.com/kIfdz88niW
— NTV Telugu (@NtvTeluguLive) August 23, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!