Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Fan Porlu dandalu on Sri Vari Mettu: మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తల్లి అంజనమ్మ, భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసి తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకున్నారు.అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈశ్వర్ రాయల్ అనే వీరాభిమాని శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లుదండాలతో మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.
Allu Arjun: అడ్డంగా దొరికేసిన అల్లు అర్జున్.. ఇలా బుక్కయ్యాడేంటి?
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
నిన్న చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమల బయలుదేరారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ… గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని, 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమలకు పొర్లుదండాలు పెడుతూ వెళుతున్నానని తెలిపారు. చిరంజీవి- కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నానన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినందుకు కూడా మొక్కు తీర్చుకుంటూ ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నానని అన్నారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!