శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల…
Chiranjeevi Fan Porlu dandalu on Sri Vari Mettu: మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తల్లి అంజనమ్మ, భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసి తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకున్నారు.అయితే మరో…
నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి…
Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన…
Fire Accident in Tirumala: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ దస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Tirumala: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి (గురువారం) నుంచి శాస్త్రోక్తంగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకు వచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు కొనసాగించారు.
తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.