తిరుమలలో పవిత్రోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. దీంతో.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ).. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. ఎల్లుండి సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారి ఉరేగింపుతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది.
TTD Anga Pradakshina Tokens: నేడు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అంగప్రదక్షిణ టోకెన్లను జారీ చేనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా వాటిని రిలీజ్ చేయనున్నారు. ఈ కోటా కింద అందుబాటులోకి తీసుకొచ్చే టికెట్ల సంఖ్య.. 250గా ఉంది. ఈ టికెట్లను పొందిన భక్తులు శనివారం అంటే ఆగస్టు 10న తెల్లవారుజామున అంగ ప్రదక్షిణ చేయవచ్చు అని అధికారులు తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై విషయం కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.. ఈ రోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1500కి పరిమితం చేశాం అన్నారు.. శ్రీవాణి దర్శన టికెట్ల జారికి శాశ్వతప్రాతిపాదికన కౌంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు.
Tirumala Tickets: నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది.