శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది..
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు…
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈరోజటితో ముగియనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని…
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు…
శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్న కొందరిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం…
తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హరిణి దాటిన తరువాత డివైడర్ను ఢీకొట్టింది. దీంతో.. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది.
తిరుపతి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీటీడీపై రకరకాల పోస్టులు పెడుతున్నారు.. అయితే, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పువు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు టీటీడీ చైర్మన్..
ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం.. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే.. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేవారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం…
చాలా బాధాకరం అన్నారు సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట వార్త మనసు కలచివేసిందన్న ఆయన.. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు అని నా భావన.. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై చర్చించాను.. మన చర్యల వల్ల దేవుని పవిత్రత దెబ్బ తినకూడదు.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. తిరుపతిలో దర్శన టోకెన్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం.. ఇది కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారని తెలిపారు.. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు…
తిరుపతి ఘటనపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. మానవ తప్పిదం వల్లే తిరుపతిలో ఆరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారన్నారు. దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగిందని.. అధికారులపై కోపాన్ని చూపించిన చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు.. అధికారులను తిట్టి తనపనై పోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని.. కానీ, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందన్నారు. ఏడు కొండలను…