TTD Big Alert: తిరుమల కొండకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
తిరుమలలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.. మలయప్పస్వామి ఒకే రోజు సప్త వాహనాలుపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ ఉంటుంది. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ, ఉదయం 11 గంటలకు గరుడవాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8…
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి…
ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు.. దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. ట్రయల్ రన్లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా…