సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు రఘునందన్.. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన.. పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు.. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు..
AP High Court: తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేసింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత సంచరించింది. ఇవాళ వేకువజామున ఒంటిగంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలో సంచరించింది. నడక మార్గంలోకి వచ్చి.. పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలను చూసి దుకాణదారులు షాక్ అవుతున్నారు. చిరుత సంచారం సమాచారంపై మెట్ల మార్గం వద్ద దుకాణదారులు ఫారెస్ట్, టీటీడీ విజిలెల్స్‌కు ఫిర్యాదు…
Local Devotees: ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ రోజు ( మార్చి 02వ తేది) స్థానిక దర్శన కోటా టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది.
Tirupati Stampede: తిరుమల తిరుపతి కొండపై జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతుంది. వర్చువల్ విధానంలో తొక్కిసలాట బాధితులను రిటైర్డ్ న్యాయమూర్తి విచారించారు. తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ జరిపారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు.. ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజులు క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్... టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ (50)గా గుర్తించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కావలి మండలం రుద్రకోట జాతీయ రహదారిపై…
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే,…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.