Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. తేదీల వారీగా పూర్తి వివరాలను తెలిపింది.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక, క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. Read Also: PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్..…
Tirumala Parakamani: తిరుమలలో ఉన్న పరకామణి పై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పూర్తి విచారణ కోరారు. బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ రెడ్డి, పాతూరి నాగభూషణం ఇటీవల రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును కలిసినప్పుడు, తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల మాయపై పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వారు, తిరుమల పరకామణిలో కనిపించకుండా పోయిన విదేశీ కరెన్సీ పై కూడా విచారణ జరిపించాలని కోరారు. ఈ కరెన్సీ పై…
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500…
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..
23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40…
కలియు ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్య గమనిక.. వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో.. మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి..
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది.
వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది.…