తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్…
కష్టపడ్డారు. అబ్బాయికి అండగా నిలబడ్డారు. అధికారంలోకి వస్తున్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈసారైనా లైన్‌లోకి రావాలనుకున్నా అధినేత అవకాశం ఇవ్వలేదు. దీంతో రూటు మార్చారు. అడగకుండానే వచ్చిన స్వామి కార్యానికి న్యాయం చేస్తూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ స్వకార్యాన్నీ నెరవేర్చుకుంటున్నారట. ఎవరాయన? ఏమా కథ..చూద్దామా..! స్వామి కార్యం.. స్వకార్యంలో వైవీ! TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూట్ మార్చారు. మొదటి విడతలో ఓన్లీ TTD మీదే దృష్టి పెట్టిన YV రెండోదఫా ప్రత్యక్ష…
తిరుమలలో జరుగుతున్న అసత్యప్రచారాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీపై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్న వారిపై విజిలెన్స్ అధికారులు కోరడా ఝూలిపిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న కౌంటర్లు ప్రైవేటీకరణ చేస్తారంటూ.. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందంటూ నిరాధరమైన ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఓ ప్రముఖ ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలపై…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆన్ లాక్ ప్రకియను మొదలు పెట్టాయి. దీంతో అన్ని రంగాలతో పాటుగా ఆలయాలు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. కాగా ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా భక్తుల సందడి కనిపిస్తోంది. సోమవారం 15,973 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 41 లక్షల రూపాయలు వచ్చినట్టు…