కేరళలో సోమవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ మధ్య వాహనంలో సీఎం కూడా కూర్చున్నారు. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు ముందు ఓ మహిళ అకస్మాత్తుగా స్కూటర్‌పై రావడంతో ఈ ఘటన జరిగింది.
శుక్రవారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగ వ్యాపించాయి. విమానంలో అలారం మోగింది.
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా…
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన…
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి యువతను అక్రమంగా పంపిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ మార్చిలో టోటల్ కన్సల్టెన్సీ, దాని యజమానులతో సహా కొంతమందిపై కేసు నమోదు చేసింది.
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్‌లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. అయ్యప్ప దర్శనానికి 80 వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.