థామస్ ఐజాక్ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి శశి థరూర్ గత 15 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ఎంపీగా చేసిన సేవలను వివరిస్తూ 68 పేజీల బుక్‌లెట్‌ను శనివారం విడుదల చేశారు.
కేరళలోని (Kerala) తిరువనంతపురం సముద్ర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating bridge) తెగిపోవడంతో 15 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
Kerala doctor Suicide: వరకట్న వివాదం ఓ మహిళా వైద్యురాలి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. షహానా అనే యువతి తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిగా ఉంది. వరకట్నం ఇవ్వలేదని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అద్దె అపార్ట్మెంట్‌లో శవమై కనిపించింది. యువతి కుటుంబం వరకట్నం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని, ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు…
Kerala : కేరళలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం ఒక మహిళకు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కేసులో ఒక మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20,000 జరిమానా విధించింది.
India vs Australia 2nd T20 Weather Forecast: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తిరువనంతపురంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలో 200 లకు పైగా లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. ఇదే ఊపులో ఇంకో మ్యాచ్ గెలిచేయాలని చూస్తోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అంచనాలను మించిపోయినా.. బౌలింగ్ మాత్రం తేలిపోయింది. దాంతో రెండో టీ20లో బౌలర్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండో…
Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు.
కేరళకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ టైమ్ టేబుల్ సిద్ధమైంది. తిరువనంతపురం-కసర్కోట్ వందేభారత్ తిరువనంతపురంలో ఉదయం 5.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు కాసర్కోట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.