కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్‌ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
READ MORE: Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
కేరళకు చెందిన మనోజ్ (44) అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఇంటి వద్ద ట్యూషన్‌లు చెప్పేవాడు. ట్యూషన్‌కు వచ్చే ఇంటర్ విద్యార్థినిపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫొటోలు తీయడంతోపాటు ఇతరులకు కూడా పంపించాడు. ఈ ఘటనతో భయపడిపోయిన అమ్మాయి.. ట్యూషన్‌కు వెళ్లడం మానింది. తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 2, 2019లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్లో ఫొటోలు తీసినట్లు తేలింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ రేఖ మాట్లాడుతూ.. “ట్యూషన్ టీచర్ మనోజ్ ఇలాంటి నేరానికి పాల్పడటం దుర్మర్గం. నిందితుడిపై కనికరం చూపకూడదు.” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలుసుకున్న దోషి మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
READ MORE: Shocking: ‘‘ వారి గౌరవాన్ని కాపాడా ’’.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన వ్యక్తి..