ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత., 1892లో స్వామి వివేకానందకు నివాళిగా నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ ధ్యానం చేస్తారు.
Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!
రాక్ మెమోరియల్ స్మారక చిహ్నం హిందూ తత్వవేత్త – సాధువుకు నివాళులర్పించడానికి నిర్మించబడింది. కన్యాకుమారి వెళ్లడం వల్ల మోడీ జాతీయ సమైక్యతకు సంకేతం ఇస్తున్నారని ఓ బీజేపీ నేత మీడియాతో అన్నారు. మే 30 నుండి, ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేస్తారు. ఈ సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించరు. ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నందున గట్టి నిఘాను నిర్వహించడానికి దాదాపు 2,000 మంది పోలీసులతోపాటు భద్రతా ఏజెన్సీలను నియమించనున్నారు అధికారులు.
Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య.. ఆపై!
నివేదికల ప్రకారం, ప్రధాని మోడీ మొదట తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్ లో కన్యాకుమారికి చేరుకుంటారు. ఆయన ల్యాండింగ్ తర్వాత సూర్యాస్తమయాన్ని వీక్షించి, ధ్యానంలో కూర్చుంటాడు. జూన్ 1న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తారు.