DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆందోళన చెలరేగింది. అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఆమె ఇంట్లో చొరబడిన దొంగ గంటన్నర సేపు ఇంట్లోనే సంచరించాడని హౌస్ మెయింటేనెన్స్ ఇన్ చార్జి లక్ష్మణ్ తెలిపారు. ‘తెల్లవారు జామున 3 గంటలకు దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ దగ్గర అలజడి రావడంతో మేము మేల్కొన్నాం. అతను రెండు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కిచెన్ పక్కనే పెద్ద గోడ ఉంటుంది. దాన్ని దూకి అతను ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు’ అంటూ లక్ష్మణ్ వివరించారు.
Read Also : PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..
కిచెన్ కు ఉన్న మిర్రర్ ను బ్రేక్ చేసి అతను ఇంట్లోకి చొరబడ్డాడని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. సీసీ కెమెరాలను బ్రేక్ చేసి అతను ఇంట్లోకి వచ్చాడని.. గంటన్నర సేపు కిచెన్ లోనే తిరిగాడన్నారు. హాల్ లోకి కూడా వచ్చాడని.. అతని ఫేస్ కనిపించలేదన్నారు లక్ష్మణ్. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదన్నారు. ఈ ఘటన జరిగే సమయంలో డీకే అరుణతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇంట్లో లేరని లక్ష్మణ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.