అప్రమత్తంగా లేకపోతే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ.. అకౌంట్ నుంచి రూ. 6 లక్షలు విత్ డ్రా చేసి షాక్ ఇచ్చాడు. బోయిన్ పల్లిలో నిజామాబాద్ బస్ ఎక్కుతుండగా ప్రసాద్ రావు అనే ప్రయాణికుడి సెల్ ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ.. చోరీ కి గురైన మొబైల్ ఫోన్ లో బ్యాంక్ యాప్ ద్వారా రూ. 6 లక్షలు విత్ డ్రా చేశాడు. అకౌంట్ లో 6 లక్షలు విత్ డ్రా కావడం తో బాధితుడు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:Karnataka: అమ్మ దేవుడా.. బతికి పోయాన్ రా.. లవర్ సాయంతో భర్తపై హత్యాయత్నం..
మొబైల్ లో పాస్ వర్డ్స్, పిన్ నెంబర్స్ సేవ్ చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగ ఉండాలని.. అకౌంట్ నెంబర్స్, ఓటీపీలను, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఇక ఇటీవల డిజిటల్ అరెస్ట్ ల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు.