పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:Hamas: గాజాపై విదేశీయుల ఆదిపత్యం అంగీకరించం.. హమాస్ కీలక ప్రకటన
నల్లగొండ జిల్లా అనుమల (మం) కొత్తపల్లి లో ఒంటరి మహిళ పై దాడి చేసి ఒంటిమీద ఉన్న 3 తులాల నగలు అపహరించారు దొంగలు. ఈ పెనుగులాటలో మహిళ తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే కుటుంబసభ్యులు వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హాలియా పోలీసులు తెలిపారు.