Major Mohit Sharma: రియల్ ధురంధర్ వర్ధంతి నేడు.. దేశం కోసం ఉగ్రవాదిగా మారిన మేజర్ మోహిత్ శర్మ సాహసగాథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Major Mohit Sharma: ప్రస్తుతం “ధురంధర్: ది రివెంజ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రం భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే పాకిస్థాన్‌లో వణుకు పుట్టించింది. సినిమాను ఆ దేశంలో బ్యాన్ చేసినప్పటికీ జనాలు మాత్రం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రణవీర్ గూఢచారి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు రణవీర్ పాత్ర ప్రయత్నిస్తుంది. అయితే.. ఈ సినిమాలో ధురంధర్ రణవీర్.. కానీ నిజ జీవితంలో మాత్రం అసలైన ధురంధర్ మేజర్ మోహిత్ శర్మ. నేడు మోహిత్ శర్మ వర్ధంతి. ‘ధురందర్’ మోహిత్ శర్మ బయోపిక్ కాదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేసినా.. ఈ సినిమాలోని ఆ పాత్ర మోహిత్ శర్మకు దగ్గరగా ఉంటుంది. అసలు ఎవరీ మేజర్ మోహిత్ శర్మ? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Dhurandhar 2: పాపం…. ధురంధర్ 2 దెబ్బకి వణికిపోతున్న పాక్ లీడర్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
దివంగత మేజర్ మోహిత్ శర్మ భారత సైన్యంలోని ఉన్నత శ్రేణి స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన విశిష్ట అధికారి. ధైర్యసాహసాలు, త్యాగాలకు గానూ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర లభించింది. మోహిత్ శర్మ 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించారు. రెండో సంతానమైన మోహిత్‌ను తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ శర్మ, సుశీల శర్మ ముద్దుగా ‘చింటూ’ అని పిలుచుకునేవారు. బడికెళ్లే వయసు నుంచే సైన్యంలో చేరాలనేది రోహిత్ కల. 12వ తరగతి అయిపోగానే ఆయన ఎన్డీఏ ఎగ్జామ్ రాశారు. అదే సమయంలో మహారాష్ట్రలోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సీటు దొరికింది. కానీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ప్రతిష్టాత్మక ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో చేరేందుకు మొగ్గు చూపారు. ఇక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) నుంచి ఉత్తీర్ణత సాధించారు. డిసెంబర్ 1999లో అధికారి హోదాలో చేరారు. ఆ తర్వాత అతను 1వ పారా (ప్రత్యేక దళాలు)లో స్వచ్ఛందంగా చేరి, అక్కడ అత్యంత ప్రమాదకరమైన రహస్య కార్యకలాపాలు నిర్వహించాడు. 2004లో ‘ఇఫ్తికార్ భట్’ అనే పేరు గల ఉగ్రవాద గ్రూపుల్లోకి ప్రవేశించి (Undercover), కీలక సమాచారాన్ని సేకరించాడు. కరెక్ట్‌గా ఇదే రోజు. అంటే మార్చిన 21, 2009న కశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఒక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ శర్మ ఒక దాడి బృందానికి నాయకత్వం వహించాడు. తీవ్రమైన కాల్పుల మధ్య పలువురు ఉగ్రవాదులను హతమార్చి, తన సహచరులను రక్షించారు. కానీ ఆ ప్రక్రియలో తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?