ఎప్పటినుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింపేజ్, సాంగ్స్ అకట్టుకోవడంతో సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియోట్ అయింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ప్లే వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25 న విడుదల కాబోతున్నది. కొద్ది…
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా పంచుకున్న ఓ పిక్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తమన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. తన మ్యూజిక్ స్టూడియోలో విశేషం చోటు చేసుకుంది. ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు…
“భీమ్లా నాయక్” సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. మెల్బోర్న్ లో జాతర షురూ అంటూ కార్లతో PSPK అనే అక్షరాలను ఫామ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” ఇప్పటికే USAలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ నుండి $200K కంటే ఎక్కువ వసూలు చేసి అద్భుతమైన ఫీట్ ను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్…
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “NBK107”. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనుండగా, దునియా విజయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్‌రూమ్‌లో పాడటం…
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మేకర్స్ కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల కాలంలో మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” నుంచి ఏకంగా సాంగ్ మొత్తం లీక్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేనా నిన్నటికి నిన్న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్” సాంగ్ నుంచి కూడా ఒక చిన్న…
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగులో యువ కథానాయకులకే కాదు అగ్ర కథానాయకులకు చక్కని మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు చక్రి. అతని సోదరుడు మహిత్ నారాయణ సైతం అన్నయ్య బాటలో నడుస్తూ, ఇప్పుడు పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ‘సి-స్టూడియోస్ (ది సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ పేరుతో ఓ స్టూడియోను నెలకొల్పబోతున్నారు. దీని లోగోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ…
అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కోసం ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన గీతాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఎస్. ఎస్. తమన్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు. ‘గ్రే’ అనేది బ్లాక్ అండ్…
తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు,…