పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, దీంతో తన రికార్డులు తానే బ్రేక్ చేశాడు.
Read Also : Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ
“భీమ్లా నాయక్” ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 1.11 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్” ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ లైక్స్ తో దూసుకెళ్లింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్ గా “ఆర్ఆర్ఆర్” నిలిచింది. దీంతో పవన్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నట్టు అయ్యింది. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “భీమ్లా నాయక్” ఈ నెల 25న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.