సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సిఫారసు చేసింది. అలాగే తెలంగాణ, బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించిన చాహల్..
2011 నవంబర్‌లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ చంద్రన్.. ఆ తర్వాత పాట్నా హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2023 మార్చి 29 నుంచి అదే హోదాలో కొనసాగుతున్నారు. కొలీజియం సిఫారసును కేంద్రం ఆమోదిస్తే.. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 33కి చేరుకోనుంది. సుప్రీంకోర్టు కొలీజియంలో న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేష్ రాయ్, అభయ్ ఎస్ ఓకా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకాన్ని ప్రకటించిన గడ్కరీ