సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశాడు ఎన్ పెద్దిరాజు. అతడు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. ఎన్ పెద్దిరాజుతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి ఆర్ గవాయ్ పిటీషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిజేఐ ఆదేశించారు.
Also Read:CM Chandrababu: ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన సీఎం..
పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు సాక్షిగా క్షమాపణ కోరాడు. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోరాడు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోర్టు ధిక్కరణ నోటీస్ పై వ్రాత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది అని తెలపింది. తదుపరి విచారణ ఆగస్టు 11 కు వాయిదా వేసింది.
Also Read:Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
వారం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చారు హైకోర్టు జస్టిస్ ఎం భట్టాచార్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఎన్ పెద్దిరాజు. 2016 లో గోపనపల్లి భూములకు సంబంధించిన వ్యవహారంలో కేసు .. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఎస్సీ మ్యూచువల్లి ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ… గోపనపల్లి లోని సర్వే నెంబర్ 127 లో, అక్రమంగా చొరబడి జెసిబి లతో నిర్మాణాలను కూల్చారని కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి తో పాటు మరి కొంతమంది స్పాట్లో ఉన్నారని కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు.. కులం పేరుతో దూషించారని కేసు పెట్టాడు పెద్దిరాజు.. అంతా రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే చేశారని పెద్దిరాజు ఫిర్యాదు చేశాడు.